అవయవదానంతో పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో పునర్జన్మ

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

అవయవదానంతో పునర్జన్మ

అవయవదానంతో పునర్జన్మ

అవయవదానంతో పునర్జన్మ

మంగళగిరి టౌన్‌: విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన అజయ్‌కుమార్‌ (48) ఈనెల 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 24వ తేదీన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అజయ్‌కుమార్‌కు 25వ తేదీన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. కుటుంబ సభ్యులు అజయ్‌కుమార్‌ అవయవాలు దానం చేసేందుకు గురువారం ముందుకు వచ్చారు. జీవన్‌దాన్‌ చైర్మన్‌ కె. రాంబాబు, హాస్పిటల్‌ డైరెక్టర్‌ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కాలేయం, కిడ్నీ మణిపాల్‌ హాస్పిటల్‌కు, మరొక కిడ్నీని విజయవాడ కామినేని హాస్పిటల్‌కు, కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. అజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement