యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

యార్డ

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు శ్రీశైలం ద్వితీయ పీఠాధిపతిగా చల్లా రామారావు శతాధిక వృద్ధురాలు మృతి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డులో రైతులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని యార్డు చైర్మన్‌ కుర్రా అప్పారావు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.చంద్రికలు గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని రైతులకు అందించనున్నట్లు వెల్లడించారు. ఉచిత భోజనంతోపాటు ఉదయం అల్పాహారం కూడా రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం సోనా మసూరి రైస్‌, పప్పు, స్వీటు, గుడ్డు, వేపుడు, సాంబారు, ఇగురు కూర, గడ్డ పెరుగు, అప్పడాలతో కూడిన భోజనాన్ని రైతులకు పెట్టడం జరుగుతుందన్నారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ రెండు, చెట్నీ, కారంపొడితోపాటు సోమ, బుధ, శుక్రవారాల్లో సాంబారుతో కట్టె పొంగలి, మంగళ, గురువారాల్లో టమాటా బాత్‌, ప్రతి రోజూ ఒక టీ కప్పు అందిస్తారని తెలిపారు. ప్రతి రోజూ నాణ్యతను పర్యవేక్షించనున్నట్లు వారు వివరించారు. యార్డు వైస్‌ చైర్మన్‌ బిట్రగుంట మల్లిక, పాలకవర్గ సభ్యులు, యార్డు ఇన్‌చార్జి సుబ్రహ్మణ్యం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చీరాల టౌన్‌: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షలను అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించడంతో పాటుగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాలన్నారు.

వేటపాలెం: శ్రీశైలం ద్వితీయ పీఠానికి పీఠాధిపతిగా వేటపాలేనికి చెందిన చల్లా రామారావుకు పట్టాభిషేకం చేశారు. శుక్రవారం శ్రీశైలంలో ఉమా రామలింగేశ్వర దేవాంగ నిత్య అన్నదాన సత్రంలో పడవీడు గాయత్రీ పీఠం పీఠాధిపతులు చెన్న కోటిలింగమూర్తి ద్వితీయ పీఠాధిపతికి పట్టాభిషేకం చేయించి కిరీటం, నంది ధ్వజం ఏర్పాటు చేశారు. ద్వితీయ పీఠాధిపతులుగా పట్టాభిషేకం చేసిన చల్లా రామారావుకు దేవాలయ పరబ్రహ్మ స్వామిగా నామకరణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ప్రతినిధులు, కుల సేనాధిపతులు పాల్గొన్నారు.

వేమూరు: అమర్తలూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అంబటి వెంకట సుబ్బమ్మ (108) గురువారం మృతిచెందారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు. ఆమెకు కుమారుడు అంబటి రామమోహన్‌రావు, కోడలు, మనవరాళ్లు ఉన్నారు. అంబటి రామమోహన్‌రావు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. వెంకటసుబ్బమ్మ భౌతికాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు, పెద్దలు సందర్శించి నివాళులు అర్పించారు.

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం 
1
1/3

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం 
2
2/3

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం 
3
3/3

యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement