జనసేన నాయకుల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

జనసేన నాయకుల ఘర్షణ

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

జనసేన నాయకుల ఘర్షణ

జనసేన నాయకుల ఘర్షణ

జనసేన నాయకుల ఘర్షణ

వినుకొండ: పల్నాడు జిల్లా పరిశీలకులు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలోనే జనసేనలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. జనసేన సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వినుకొండకు వచ్చిన పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. సభలో నూజెండ్ల మండల కన్వీనర్‌ వేముల వెంకటేశ్వర్లను వేదికపైకి పిలవకుండా ఉపాధ్యక్షుడు రాజబాబును పిలవడంతో వివాదం మొదలైంది. వినుకొండలో జనసేన నాయకుడు నిశంకరరావు శ్రీనివాసరావు, నాగశ్రీను రాయల్‌ ఇరువురు ఎవరికి వారు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వెల్లటూరు రోడ్డులో కొణిజేటి నాగశ్రీను రాయల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నిశంకరరావు శ్రీనివాసరావు తన అభిమానులతో హాజరయ్యారు. ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement