ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు

ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు

చిత్ర దర్శకుడు దిలీప్‌ రాజా

నగరంపాలెం: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ) రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు తప్పవని మా–ఏపీ వ్యవస్థాపకులు, చిత్ర దర్శకుడు దిలీప్‌రాజా అన్నా రు. గురువారం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో మా–ఏపీ 24 విభాగాల యూనియన్‌ సభ్యులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి దర్శకుడు అచ్చన శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షత వహించారు. దిలీప్‌రాజా మాట్లాడుతూ సాంకేతిక వర్గం అవసరం లేకుండా ఏఐతో చిత్రాలను రూపొందించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సంగీత దర్శకులు లేకుండానే కృత్రిమ మేధ పాటలకు ట్యూన్లు వస్తు న్నాయని అన్నారు. సన్నివేశాలు చెబితే సంగీతం వస్తుందని చెప్పారు. భవిష్యత్‌లో సాంకేతిక వర్గం అవసరం లేకుండానే చిత్రాలు విడుదలవుతాయ న్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు, దర్శకుడు రాజమౌళి ఫైటింగ్‌ దృశ్యాలు హల్‌చల్‌ చేస్తున్నాయని చెప్పారు. దీన్ని ఏఐ రూపొందించిందని తెలిసి సంబరపడాలా? లేదా ఎవరి ప్రమేయం లేకుండా వచ్చిన వీడియోతో భవిష్యత్‌ ప్రమాదకరమో ముందస్తుగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని హెచ్చరించారు. ఏ చిత్రంలో అయినా ఏఐ దృశ్యాలుంటే సెన్సార్‌ చేయకుండా నిర్దిష్టమైన నియమాలను ఆచరణలోకి తేవాలన్నారు. సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, 24 విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement