మేలుకో.. రిజిస్ట్రేషన్ చేసుకో!
ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బీమా వంటి సేవలు వివిధ జాబితాల ఆధారంగా అమలయ్యాయి.
రాబోయే రోజుల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉన్న రైతులకే అన్ని రైతు సేవలు అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యను అందజేయనున్నారు. నమోదు లేకపోతే పథకాల లబ్ధి పొందే అవకాశం ఉండదని చెబుతున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల భూ వివరాలు, పంటల సమాచారం, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ఒకే డేటాబేస్‌లో నమోదవుతాయి. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి, నకిలీ లబ్ధిదారులకు అడ్డుకట్ట, పథకాల అమలులో పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,37,143 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,16,950 మందికి నమోదు పూర్తి చేశారు. ఇంకా 20,193 మందికి పూర్తి చేయాల్సి ఉంది.
డోర్‌లాక్, డెత్ కేసులతో ఈ నమోదు పక్రియ తడబాటు ఎదురవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ–పంట నమోదు, అదనపు సర్వేలు సైతం వేధిస్తున్నాయని వాపోతున్నారు.
చాలా మంది రైతులు సొంతూళ్లు వదిలి వ్యాపారం, పిల్లల సంరక్షణ, చదువుల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లిపోయారు. వారంతా స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు.
మరణించిన భూ యజమానుల వారసులు భూములను తమ పేరిట మార్చుకోకపోవడం, ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసంధానం చేయించుకోకపోవడం తదితర సమస్యలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఇంకో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండటంతో.. సిబ్బంది హడావుడి చేస్తున్నారు. రైతులకు ఫోన్ చేసి రైతు సేవా కేంద్రాలకు రావాలని.. లేకుంటే ఆధార్, ఓటీపీలు చెబితే నమోదు చేస్తామని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో పంటల బీమా, నష్ట పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీలు, రైతు సేవా కేంద్రాల సేవలు వంటి అన్ని అంశాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధారంగానే అమలు చేయనున్నారు. ఇప్పుడు నమోదు చేసుకోకపోతే భవిష్యత్‌లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతుల భవిష్యత్తుకు కీలకం. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
–ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు
కొరిటెపాడు(గుంటూరు): అక్టోబర్ మాసంలో మొదలైన రబీ సీజన్ ఫిబ్రవరి ఆఖరుకు దాదాపుగా ముగిసింది. ఈ సారి 65,295 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, చివరకు 131.73 శాతంతో 86,015 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది.
కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల చివరి నాటికి ముగియనుంది. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం 1,37,143 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,16,950 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మిగిలిన 20,193 మంది తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా జరిగే ఉపయోగాలను వెల్లడిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ఇంకా 20,193 మంది..
అందుబాటులో లేక..
మేలుకో.. రిజిస్ట్రేషన్ చేసుకో!


