ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

ఏప్రి

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల

ప్రత్తిపాడు/గుంటూరు రూరల్‌: కాకుమాను మండలం కొండపాటూరులో కొలువుదీరిన పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని ఏప్రిల్‌ 7వ తేదీన వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె.శ్రీనివాసరావు తెలిపారు. కొండపాటూరు లోని పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం తిరునాళ్ల ఏర్పాట్లుపై తహసీల్దార్‌ వెంకటస్వామి అధ్యక్షతన తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 31వ తేదీన మల్లెపూల పూజ, ఏప్రిల్‌ 3న కుంకుమ పూజ, ఏప్రిల్‌ 7వ తేదీన తిరునాళ్లతో పాటు సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్‌, పోలీస్‌, వైద్య, ఆరోగ్యశాఖలతో పాటు ఆయా శాఖల అధికారులతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్‌, రెవెన్యూ అధికారులు చర్చించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఎదురువనున్న రోడ్డు, విద్యుత్‌, ట్రాఫిక్‌ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తిరునాళ్లకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయా లని సూచించారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ జి.శ్రీనివాసరావు తదితరులుపాల్గొన్నారు.

వైభవంగా గోపుర

కలశ స్థాపన

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో లక్ష్మీ నరసింహస్వామి, భూనీళా సమేత వైకుంఠ నాధ పెరుమాళ్‌, లక్ష్మీ హయగ్రీమస్వామివారు,యోగాంజేయస్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని తెలిపా రు. మంగళవారం ఉదయం మృత్తికా స్నపనం, నయనోన్మీలనం, మన్యుసూక్త హవనం, శయ్యాధివాసం, త్రిదండి అహోబిల రామా నుజ జీయర్‌స్వామి వార్ల వారి చేతుల మీదుగా గోపురం కలశ స్థాపన, అనంతం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొందారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

ఈలపాట రఘురామయ్యకు ఘన నివాళి

సుద్దపల్లి(చేబ్రోలు): ఈలపాట ద్వారా ప్రజల మన్ననలు పొందిన రఘురామయ్య అందరికి ఆదర్శనీయమని ఈలపాట రఘురామయ్య కమిటీ అధ్యక్షులు కల్యాణం సత్యనారాయణ అన్నారు. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం ఈలపాట రఘురామయ్య వర్థంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ మండపం సమీపంలోని ఆయన విగ్రహానికి గ్రామస్తులు, పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన కల్యాణం రఘురామయ్య ఈలపాటనే ఇంటిపేరుగా చేసుకున్న గొప్ప కళాకారుడని, వెండితర నటుడుగా కూడా ఖ్యాతి గాంచారని నేతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డుతో మరింత గౌరవం పొందారన్నారు. గోవాడ మోహనరావు, మట్టుపల్లి పోతురాజు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల 1
1/2

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల 2
2/2

ఏప్రిల్‌ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల

Advertisement
 
Advertisement
Advertisement