జనాభా లెక్కల శిక్షణ అత్యంత కీలకం
2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్య్రం వచ్చాక 8వది, ప్రపంచంలోనే పురాతనమైన జనాభా లెక్కల సేకరణ అని పేర్కొన్నారు.
రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశ హౌస్ లిస్టింగ్ , హౌసింగ్ సెన్సస్(హెచ్‌ఎల్‌ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని తెలిపారు.
ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
జన గణన మన రాష్ట్రంలో రెండు దశల్లో నిర్వహిస్తారని, మొదటి దశలో మొదటగా ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఆస్తుల డేటాను తీసుకోవడం జరుగుతుందన్నారు. మే1 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటిని సందర్శించడం జరుగుతుందన్నారు.
రెండవ దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వ్యక్తుల వలస, సంతానోత్పత్తి, సామాజిక–సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై డేటా సేకరణ చేస్తారన్నారు.
జన గణన సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయరాదని, రికార్డులను ట్యాంపర్ చేయడం, పత్రాలను తొలగించడం, దాచడం, దెబ్బతీయడం లేదా నాశనం చేయడం చట్ట రీత్యా నేరమని అన్నారు.
జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ డేటా సేకరణ కోసం నియమించే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
జనాభా లెక్కల కార్యనిర్వహణ అధికారి, జాయింట్ డైరెక్టర్ జి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందుకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్, వెబ్‌పోర్టల్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరువెస్ట్: జన గణనలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను పర్యవేక్షించే చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్ల బాధ్యతలు చాలా కీలకమైనవని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో పట్టణం, మండలాలను యూనిట్‌గా తీసుకొని పట్టణాల్లో డిప్యూటీ కమిషనర్లు చార్జ్ ఆఫీసర్లుగా, టౌన్ ప్లానింగ్ అధికారులు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా, మండలాల్లో తహసీల్దార్‌లు చార్జ్ ఆఫీసర్లుగా, ఎంపీడీవోలు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా నియమించారన్నారు. వీరికి మొదటి విడత శిక్షణను మూడు రోజులు అందిస్తున్నామన్నారు. జేసీ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు.


