● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది విద్యార్థులు హాజరు ● గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది విద్యార్థులు హాజరు ● గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది వ

● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది వ

● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది విద్యార్థులు హాజరు ● గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీయెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 87 కేంద్రాలలో 32,287 మంది విద్యార్థుల్లో 31,777 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో ఆర్‌ఐవో జి.సునీతతోపాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుత్ను తీరుతోపాటు తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాట్లు పరిశీలించారు. విద్యుత్‌ సరఫరా, విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు బస్సు సదుపాయం వంటి అంశాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్‌ దుకాణాలను మూసివేయించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో తప్పుడు వదంతులకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని సూచించారు. ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతున్న తీరు, తెన్నులను పరిశీలించారు. ఆర్‌ఐవో జి.సునీత ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement