అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు | - | Sakshi
Sakshi News home page

అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు ● మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనైతిక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సైతం నివ్వెరపోయే విధంగా దాడి చేశారని, చంద్రబాబు, నారా లోకేష్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీలోని నాయకులకు స్ఫూర్తిగా అంబటి రాంబాబు నిలిచారన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. ● టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న దాడులు చూస్తుంటే రక్తం మరుగుతోందన్నారు. అంబటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అంబటిపై దాడి కాపు కులంపై దాడేనన్నారు. ● మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ నివాసాలపై వరుసగా దాడులు జరిగాయని, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 14 నెలలు జైలులో పెట్టారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి దాడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ● టీడీపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వందనాదేవి మాట్లాడిన భాషను ఆ పార్టీ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. జరిగిన ప్రతి దాడిని గుర్తుపెట్టుకుంటామని, పోలీసులు దగ్గరుండి దాడి చేయించడాన్ని మర్చిపోమన్నారు. ● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ, వేల మంది వచ్చి దాడులు చేస్తున్నా.. కత్తులు, కర్రలతో హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా, కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన మాజీ మంత్రి అంబటి రాంబాబులో తనకొక హీరో కనపడుతున్నారని చెప్పారు. ● పక్కా ప్లాన్‌ ప్రకారం టీడీపీ గుండాలు దాడి చేశారని, ఇంటిపై, కార్యాలయంపై నిర్విరామంగా ఏడు గంటలకు పైగా విధ్వంసం సృష్టించటం దుర్మార్గమన్నారు. పోలీసులు దగ్గరుండి రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్‌తో దాడులు చేయించారని ఆరోపించారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌) : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వేమూరు సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, అద్దంకి సమన్వయకర్త డాక్టర్‌ చింతలపూడి అశోక్‌, పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డిలు మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడారు.

ఈ దాడులు చూస్తుంటే రక్తం మరుగుతోంది...

అంబటిలో నాకొక హీరో కనపడ్డారు

Advertisement
 
Advertisement
Advertisement