పటిష్ట ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలి జిల్లా కలె
పటిష్ట ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ , డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్, కై ్లయిమ్స్ పరిష్కారం నియోజకవర్గాల వారీగా వివరాలను తెలిపారు, బూత్ లెవల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ఓటరు జాబితాలకు సంబంధించిన వివరాలు అందించేలా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఈఆర్వోలు డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మికుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు చల్లా ఓటులేసు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.
శాప్ లీగ్ సైక్లింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శాప్ లీగ్ పోటీల్లో భాగంగా సైక్లింగ్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్ స్టేడియం వద్ద జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలను కార్పొరేటర్ షేక్ మీరావలి, ఏఎస్‌ఐ షేక్ నజీర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ ప్రతిభకనబరచిన వారిని గుర్తించి ఈ నెల 28 నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నాయకులు లింగినేని శ్రీనివాసరావు, భాను ప్రసాద్, కోచ్ వి.కనకారావు పాల్గొన్నారు.
1/1
పటిష్ట ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలి జిల్లా కలె