పట్టించుకోరా! | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోరా!

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

పట్టి

పట్టించుకోరా!

మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పట్టించుకోరా! నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు ఇఫ్తార్‌ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.27 5.15 నరసరావుపేట 6.21 5.13 బాపట్ల 6.19 5.11 ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు సచివాలయాన్ని మార్చేస్తారా! సమస్యలు పరిష్కరించాలి భూములు తిరిగి ఇచ్చేయండి పచ్చని పొలాలు తీసుకున్నారు..

న్యూస్‌రీల్‌

కొండమరాజు గ్రామ బాధితుల ఆవేదన పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేదేమీ లేదంటూ తేల్చి చెప్పిన జేసీ

గుంటూరు
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
రాజధాని కోసం భూములిస్తే

తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,000, గరిష్ట ధర రూ.7,600, మోడల్‌ ధర రూ.7,000 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 539.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 24,222 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.

మా భూమి రెండెకరాలు ల్యాండ్‌ ఫూలింగ్‌కు ఇచ్చాం. తొలి మూడేళ్లు మాకు జరీబు కింద కౌలు చెల్లించారు. ఎనిమిదేళ్లుగా ఆపేసారు. మా భూమిలో బోరు, కరెంట్‌ ఉన్నాయి. అన్ని రకాల పంటలు పండించే వాళ్లం. ఇప్పుడు కొత్తగా అధికారులు డ్రై ల్యాండ్‌ అంటున్నారు. రాజధాని కోసం భూమిలిచ్చిన మాలాంటి వాళ్లను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తారా, మరీ ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలి.

– తోట శివకుమారి

మేము ఎకరా పొలం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. నిబంధనల ప్రకారం మాకు ప్లాటు ఇచ్చారు. ఇప్పుడు మీది మెట్ట భూమి మీకు జరీబు భూమి హక్కుదారులకు ఇచ్చినట్లు ఇవ్వడం కుదరదని ఇచ్చిన ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. బంగారం లాంటి భూమిని తీసుకుని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదు.

– టి.ధనలక్ష్మి

గుంటూరు వెస్ట్‌: అమరావతి రాజధాని నిర్మాణం కోసం విలువైన తమ భూములిచ్చిన కొండమరాజు పాలెం గ్రామ నిర్వాసితులు ఇప్పుడు బోరుమంటున్నారు. అధికారులు కూడా కనీసం స్పందించడం లేదు. భూములు తీసుకున్న ప్రారంభంలో జరీబు కింద నమోదు చేసుకుని కౌలిచ్చిన అధికారులు ఇప్పుడు జరీబు కాదు మీది కేవలం మెట్ట భూమి మాత్రమే అని చెబుతున్నారు. దీంతో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, స్థలంలో సుమారు 200 చ.గ. భూమిని కోల్పోవాల్సి వస్తుంది. బాధితులు సోమవరం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌ (పీజీఆర్‌ఎస్‌)లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవత్సకు వినతిపత్రం అందజేశారు. తాము చేసేదేమీ లేదని జేసీ ఖరాఖండీగా చెప్పేశారు. తుళ్లూరు మండలంలోని అబ్బరాజుపాలెం, బోరుపాలెం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోని 71 మంది భూములిచ్చిన రైతులకు జరీబు కింద నమోదు చేసిన అధికారులు సమీపంలోనే ఉన్న కొండమరాజు గ్రామానికి చెందిన 17 మంది బాధితుల భూములు జరీబులో లేవని చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆవేదన వారి మాటల్లోనే...

పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెంలో ప్రభుత్వ భవనంలో గ్రామ సచివాలయం 7 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ గ్రామంతోపాటు అబ్బినేనిగుంటపాలెం ప్రజలకు ఇది సౌలభ్యంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి సమాచారంగాని, నిబంధనలు పాటించకుండా కొంతమంది ఈ సచివాలయాన్ని అబ్బినేనిగుంటపాలెంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలి.

– గొరిజవోలు గ్రామ ప్రజలు

జిల్లాలో అసంఖ్యాకంగా ఉన్న దివ్యాంగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. మూడు చక్రాల వాహనాలు అందజేయాలి.

– బొక్కా ఆగస్టీన్‌, వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు

రెండెకరాల భూమి ఇచ్చి చందాల కోసం తిరిగినట్లు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మా గ్రామంలో 17 మందికి మాత్రమే ఇలా మెట్ట అని రాశారు. దీనిని వెంటనే మార్చాలి. మాకు న్యాయం చేయకపోతే మేము ఇచ్చిన భూములు మాకు ఇచ్చేయాలి. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా. భూములు సర్వే చేయించిన జేసీ అశుతోష్‌ శ్రీవత్సకు వినతిపత్రం ఇస్తే ఏమీ చేయలేమని చెబుతున్నారు. – కె.నాగభూషణం

మా భూమిలో మూడు పంటలు పండేవి. రాజధాని అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు. పైన నాయకులు చెప్పే మాటలకు కింద స్థాయిలో అధికారుల వ్యవహార శైలికి సంబంధం లేకుండా ఉంది. న్యాయమైన మా సమస్యలను పరిష్కరించకుండా మా భూముల్లో వీఐపీ టవర్స్‌ కడుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం. దీనిని న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం. – కె.లావణ్య

7

పట్టించుకోరా! 1
1/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 2
2/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 3
3/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 4
4/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 5
5/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 6
6/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 7
7/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 8
8/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 9
9/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 10
10/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 11
11/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 12
12/13

పట్టించుకోరా!

పట్టించుకోరా! 13
13/13

పట్టించుకోరా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement