ఎన్ని రోజులు జైలులో పెట్టారు..? | - | Sakshi
Sakshi News home page

ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?

ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?

ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?

చంద్రబాబు, లోకేష్‌ స్థాయిలో జరిగిన కుట్ర మేరకే ఈ దాడి ఆ రోజు పోలీసుల ప్రేక్షకపాత్రకు వారు ఇచ్చిన ఆదేశాలు కాదా? ఈ దాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతపాలన ఉంటే జవాబులు చెప్పండి కేంద్ర ర్యాంకింగ్స్‌లో చివరి స్థానానికి దిగజారిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి వారిని

గుంటూరు ఎడ్యుకేషన్‌: సీఎం చంద్రబాబును దూషించాననే ఆరోపణలతో తనను 18 రోజులు జైలులో పెట్టించిన టీడీపీ ప్రభుత్వం, తన ఇంటిపైనా, కార్యాలయంపైనా దాడి చేసిన వారిని ఎన్ని రోజులు జైలులో పెట్టించారో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులోని తన నివాసం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎంకు సంధించారు.

● తన ఇంటిపై దాడికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ స్థాయిలో కుట్రలు జరిగాయన్నారు. పోలీసుల ప్రేక్షక పాత్రకు కారణం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కావా అని ప్రశ్నించారు? ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలన్నారు.

● తమ ఆదేశాలతో పంపిన టీడీపీ రౌడీ మూకలు ఏం చేసినా మౌనంగా ఉండాలని చెప్పడం వలనే దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు లేదా ఆయన కుమారుడు లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

● సీఎంను దూషించానని తనను అక్రమ కేసులతో జైలుకు పంపిన ప్రభుత్వం, తన ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఎన్ని రోజులు జైల్లో ఉంచారో చెప్పాలన్నారు.

● తాను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించానని, రిమాండ్‌ రిపోర్టులో తనపై అభాండాలు వేశారన్నారు. సీఎం సామాజిక వర్గాన్ని తాను దూషించానని రిపోర్టులో పొందుపర్చారని, అందు వలనే సీఎం కులానికి చెందిన వారిని తన ఇంటిపైకి పంపించారా అని ప్రశ్నించారు ?

● రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతుంటే, తన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌ ప్రోద్బలంతో వారు పోలీసు శాఖకు ఇచ్చిన ఆదేశాలతోనే తన ఇల్లు, కార్యాలయాలపై దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేకుంటే తన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లే భావించాల్సి వస్తుందన్నారు.

కూటమి నేతలు ఫోన్‌లో పరామర్శించారు

● తన ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరిగి, తనను అక్రమంగా జైల్లో పెట్టించిన తరువాత వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని అన్నారు. తాను జైల్లో ఉన్న రోజుల్లో ఎంతో మంది వైఎస్సార్‌సీపీ నేతలు ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యుల్లో నింపిన ధైర్యం, వారు ఇచ్చిన ఓదార్పును మర్చిపోలేమని చెబుతూ వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

● తనపై మోపిన అక్రమ కేసులను టీడీపీ, జనసేన నేతలు తప్పుపట్టారని చెప్పారు. టీడీపీ, జనసేనలో రాజ్యాంగాన్ని గౌరవించే పలువురు నేతలు తనకు ఫోన్‌ చేసి పరామర్శించారన్నారు.

● దేశంలోని 10 రాష్ట్రాల్లో శాంతి, భద్రతలు, పరిపాలనలో కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో ఏపీ చివరిస్థానంలో ఉందని, భవిష్యత్తులో 29 రాష్ట్రాలస్థాయిలో సర్వే చేసినా టీడీపీ ప్రభుత్వ తీరుతో మన రాష్ట్రానికి చివరి స్థానం వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు.

● వైఎస్సార్‌ సీపీ రైతు విభాగ నేత ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రాజకీయ దాడులు, కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఈ 20 నెలల కాలంలో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు, పోలీసు కేసులు, భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement