కాటూరిలో గుండె ఆపరేషన్‌లకు రంగం సిద్ధం
గుంటూరు మెడికల్: ఏపీలోనే తొలిసారిగా గుండె చికిత్సలు చేసే అడ్వాన్స్‌డ్ ఇంటర్వెన్షనల్ సీమెన్స్ క్యాథ్‌ల్యాబ్ (గుండె వ్యాధుల చికిత్స)ను రూ. 6 కోట్లతో ఏర్పాటు చేసినట్టు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ చెప్పారు. ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గుండె శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్ ప్రారంభిస్తారని చెప్పారు. గుంటూరులోని కాటూరి అర్బన్ క్లీనిక్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాథ్ ల్యాబ్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందన్నారు. ఈ విధమైన ల్యాబ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌లో తమ వద్ద మాత్రమే ఉందన్నారు.
రేపు గవర్నర్ చేతుల మీదుగా ఆధునిక క్యాథ్‌లాబ్ ప్రారంభం


