జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
పట్నంబజారు: గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది బాధితులు, ఫిర్యాదుదారులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 215 అర్జీలను అధికారులు స్వీకరించారు. ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, ఈస్ట్ సబ్‌డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావులు ఫిర్యాదులు స్వీకరించారు.
నేను చుట్టుగుంటలో నివాసం ఉంటూ.. జేకేసీ కళాశాల రోడ్డులో పౌల్ట్రీ ఫాం నిర్వహిస్తున్నా. ఈ నెల 12వ తేదీ రాత్రి సుమారు 20 మందిపైగా వచ్చి మా చికెన్ షాపుపై దాడి చేశారు. కోడిగుడ్లు, రూ.19 వేల నగదు ఎత్తుకెళ్లారు. షాపు గేటు పగులకొట్టి, దుకాణాన్ని సర్వనాశనం చేశారు. ప్రొక్లయినర్‌తో వచ్చి పక్కనే ఉన్న నివాసాలను కూడా ధ్వంసం చేశారు. దీనిపై 13వ తేదీన పట్టాభిపురం సీఐకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ప్రాణహాని కూడా ఉంది. వారిని కఠినంగా శిక్షించటంతోపాటు మాకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– నేరెళ్ళ దుర్గానాగమల్లేశ్వరరావు (చుట్టుగుంట)


