
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్‌గా కంపెనీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లు
టెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
టెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.76 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.
50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.
టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్‌టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్‌ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.
డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్‌లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు.