గ్యాస్‌ గోడౌన్‌ వద్ద వినియోగదారుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గోడౌన్‌ వద్ద వినియోగదారుల ఆందోళన

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

పర్చూరు(చినగంజాం): పర్చూరులో గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరా లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పర్చూరు గ్యాస్‌ గోడౌన్‌ వద్ద సిలిండర్‌ల పంపిణీ విషయమై కాస్తంత గందరగోళం నెలకొంది. గోడౌన్‌ వద్దకు సిలిండర్‌ల స్టాకు వచ్చిందన్న సమాచారం రావడంతో ముందుగా సిలిండర్‌లు బుక్‌ చేసుకున్న వినియోగదారులు భారీగా వచ్చి చేరారు. అందరికీ సిలిండర్‌ల పంపిణీ చేయలేమన్న నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. ఆమెరికా–ఇరాన్‌ యుద్ధ నేపథ్యంలో దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ల కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో పర్చూరులో గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య సిలిండర్‌ల సరఫరా తక్కువగా ఉండటం, గృహ వినియోగ సిలిండర్‌లు రెగ్యులర్‌గా పంపిణీ జరుగుతుండటంతో వ్యాపారులు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్‌లను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

పర్చూరులో గ్యాస్‌ సరఫరా సమస్యలతో

ప్రజల ఇబ్బందులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement