యడ్లపాడు: నాటక రంగానికి యువతరం ఊపిరి కావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య చెప్పారు. కొండవీడు కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజు ప్రదర్శనలను లింగారావుపాలెం మాజీ సర్పంచ్ షేక్ కరిమూన్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వ్యాపారవేత్త దెందుకూరి రవిరాజా నటరాజ పూజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు నంబూరు వీరాంజనేయులు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాటక రంగం పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా యువతలోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని కళారంగంవైపు మళ్లించి తీసుకురావల్సిన బాధ్యత ముందు కుటుంబం నుంచి ప్రారంభం కావాలన్నారు. మరో అతిధి అనంతలక్ష్మి నూలుమిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు నాటకాల్లో పురుషులే సీ్త్రపాత్రల్ని పోషించేవారని, నేడు సీ్త్రలే సీ్త్రపాత్రలు చేయడంతో పాటు ఒక్కో నాటికలో ఎక్కువ మంది సీ్త్రలు ఉండటం శుభపరిణామమన్నారు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రామచంద్రప్రసాద్, పఠాన్ యూసఫ్, గరికపాటి సుబ్బారావు, మలినేని సుబ్బారావు, ఆలోకం సుబ్బారావు, ముద్దన రాఘవయ్య చౌదరి ప్రసంగించార. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కట్టా శ్రీహరిరావు, ఆలోకం సాంబశివరావు, మండెపూడి శ్రీనివాసరావు, నంబూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య


