బాపట్ల: బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభివృద్ధి చేసేందుకు జిల్లా అడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌కుమార్‌లు తెలిపారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ అడహాక్ కమిటీ చైర్మన్‌గా జీవీవీ రాఘవరెడ్డి, కన్వీనర్‌గా పసుమర్తి శ్రీనివాసరావు, సభ్యులుగా కే రోశయ్య, జే సుధాకర్, కే అంజిబాబు, జే మార్తా, వై రాజేష్‌బాబు, ఎన్ పెద్ద పుల్లారావు, టీ తరుణ్‌రాజ్‌లను నియమించినట్లు తెలిపారు. చైర్మన్‌గా ఎంపికై న రాఘవరెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని అన్ని తాలుకా కమిటీలను బలోపేతం చేస్తామని, జిల్లా మొత్తం పర్యటించి సభ్యత్వ నమోదు చేయిస్తామని తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ, కార్యదర్శి రమేష్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


