బాపట్ల : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ వేమూరి రాధాకృష్ణపై గురువారం ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించే రాధాకృష్ణ మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను భగ్నం చేసేందుకు కుట్ర పూరితమైన రాతలు రాస్తున్నారని కోన వివరించారు. ప్రజాస్వామ్య విలువలు సైతం దెబ్బతినేవిధంగా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాలాద్రి, అడే చందు, నర్రావుల వెంకట్రావు, కటికల ఝెహోషువ, పాలపర్తి గోపి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ డెప్యూటీ స్పీకర్
కోన రఘుపతి డిమాండ్


