సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ప్రజలు | - | Sakshi
Sakshi News home page

సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ప్రజలు

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో ఇరువురికి పదవులు నిందితుడికి రెండేళ్ల జైలు టీ–20 సీనియర్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రషీద్‌ రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

భట్టిప్రోలు(వేమూరు): మండలంలోని సూరేపల్లిలో గురువారం జరిగిన సీఎం సభలో ప్రజలు మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మధా్‌య్‌హ్నం 12 గంటలకు ప్రజావేదిక సభ ప్రారంభం కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు 12.30 నిమిషాలకు మాట్లాడడం ప్రారంభించారు. మీటింగ్‌ వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు మధ్యాహ్నం 1 గంటకల్లా సగం మంది వెళ్లి పోయారు. సీఎం ప్రసంగం మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు వెళ్లి పోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. అసలే ఆశించినంత మంది ప్రజలు సభకు రాక స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకోగా.. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది లేచి వెళ్లిపోవడంతో చేసేదేమి లేక చూస్తు ఉండిపోయారు.

బాపట్లటౌన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాపట్లకు చెందిన ఇరువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సోషల్‌ మీడియా వింగ్‌ జాయింట్‌ సెక్రటరీగా బాపట్లకు చెందిన చెరుకూరి కిరణ్‌, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జాయింట్‌ సెక్రటరిగా బాపట్లకు చెందిన జి.ఎ.మణిభూషణ్‌లు నియమితులయ్యారు.

కారంచేడు: కొనుగోలు చేసిన మిరపకాయల డబ్బు ఇవ్వకపోవడంతో రైతు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణ జరిపిన పర్చూరు కోర్డు నిందితునికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.5000 జరిమానా విధించారు. కారంచేడు ఎస్సై షేక్‌ ఖాదర్‌బాషా అందించిన సమాచారం మేరకు.. మండలంలోని కేశవరప్పాడు గ్రామానికి చెందిన రైతుల నుండి అదే గ్రామానికి చెందిన కొసరాజు నాగేశ్వరరావు, మరో వ్యక్తి రామిశెట్టి కోటేశ్వరరావు రూ.19 లక్షల విలువైన మిరపకాయలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో 2021 జూన్‌ 14వ తేదీన కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తగిన సాక్షులను సేకరించి కోర్టుకు హాజరుపర్చడంతో ప్రథమ నిందితునిగా ఉన్న నాగేశ్వరరావుకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతోపాటు, రూ.5 వేల జరిమానా విధించించిట్లు తెలిపారు.

గుంటూరువెస్ట్‌(క్రీడలు): మూలపాడులో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఏసీఏ సీనియర్‌ టీ–20 పురుషుల అంతర్‌ జిల్లాల మ్యాచ్‌లలో పాల్గొనే క్రికెట్‌ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ త్రీమెన్‌ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రికెటర్ల వివరాలు....

ఓ.రషీద్‌(కెప్టెన్‌) కె.మహీప్‌, ఎం.వంశీకృష్ణ (వికెట్‌ కీపర్‌), ఎస్‌.అఖిల్‌, జి.సమన్విత్‌, సిహెచ్‌.సిద్ధార్థ, ఎ.ప్రణయ్‌కుమార్‌, ఎం.రేవంత్‌కుమార్‌, ఎస్‌.కె.అస్లాం బేగ్‌, జి.ఆకాష్‌, పి.సిద్దు కార్తీక్‌రెడ్డి, కె.మనోహర్‌, ఎస్‌.కె.తౌఫిక్‌, జె.జయచంద్రకేశవ్‌, ఓ.బాజీ.

స్టాండ్‌ బైస్‌:

కె.పి.సాయి రాహుల్‌, పి.శరత్‌ చంద్ర, ఈ.రోహ్ని అమోల్‌, ఎస్‌.గోపికృష్ణ, అబ్దుల్‌ షరీఫ్‌, డి.హేమంత్‌. కోచ్‌గా వి.వి.బి.సరస్వతిరెడ్డి వ్యవహరిస్తారన్నారు.

శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్‌ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్‌పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్‌కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌ బాబు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement