మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం | - | Sakshi
Sakshi News home page

మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

బాపట్ల వ్యవసాయ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పదోసారి కలుసుకున్న 1980 బ్యాచ్‌ విద్యార్థులు

బాపట్ల: వ్యవసాయ కళాశాల 1980 బ్యాచ్‌ విద్యార్థులు గురువారం సందడి చేశారు. కళాశాలలో పూర్వ విద్యార్థుల పదో సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కళాశాలను చూసేందుకు పదేపదే రావటం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాల బాపట్ల మాజీ ఏడీ ఏ.శ్రీనివాసరావు తనకు ఈ కళాశాలతో 24 ఏళ్ల అనుబంధం ఉందని తెలియజేశారు. 1980 బ్యాచ్‌ విద్యార్థులు కళాశాల అభివృద్ధి కోసం చాలా సాయం చేశారని తెలియజేశారు. పి.ప్రసన్న రాణి, ఎ.శ్రీనివాసరావు, ఎస్‌.హరిప్రసాద్‌, ఎండీ ఆఫ్‌ మీవా గ్రూప్స్‌ నిర్వహకులను సన్మానం చేశారు. హరిప్రసాద్‌ రూ.50 లక్షలు ఎటిక్‌ బిల్డింగ్‌ కోసం విరాళం ఇచ్చారు. ఉగాది పురస్కారం అందుకున్న వి.గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement