బాపట్ల: అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. అభివృద్ధి రేటులో బాపట్ల జిల్లా రానున్న మూడు నెలల్లో 10వ ర్యాంకులోకి వెళ్లాలని జిల్లా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి చెప్పారు. అన్ని రంగాల్లో జిల్లా ఎదిగేలా అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లా అధికారుల్లో ఆరోగ్యకరమైన పోటీ రావాలి, స్ఫూర్తితో పనిచేయాలన్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తులు, చేపలు, రొయ్యల ఉత్పత్తులు జిల్లాలో అధికంగా ఉన్నందున ప్రాసెసింగ్ యూనిట్ల పెరగడానికి కృషి చేయాలన్నారు. ఇలాంటి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలన్నారు. గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు మాంసం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మాంసం ఎగుమతులకు విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నందున ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడిదారుల వద్దకు అధికారులు వెళ్లి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించాలని మంత్రి సూచించారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి


