తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌కు చెందిన స్కేటింగ్ క్రీడాకారుడు తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్–2026 అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తైవాన్ దేశం సించు ప్రాంతంలో చైనీస్ తైపీ రోలర్ స్టోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 19వ వరకు జరిగే అంతర్జాతీయ పోటీల్లో క్రీడాకారుడు మెరుగుపాల హశిష్ పాల్గొననున్నాడు. హశిష్ అండర్–15 విభాగంలో మన దేశం నుంచి స్కేటింగ్‌లో ఐదు విభాగాలైన క్వాడ్ ఫ్రీ, ఇన్‌లైన్ ఫ్రీ స్టయిల్, కపిల్ డాన్స్, హెయిర్ స్టైల్, క్వార్టెట్ పోటీల్లో తలపడనున్నారు. హశిష్ తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లో శిక్షణ పొందుతున్నాడు. హశిష్‌ను స్థానికులు అభినందించారు. హశిష్‌కు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులకు హశిష్ తల్లిదండ్రులు మెరుగుపాల రాజు, మాధవి ధన్యవాదాలు తెలియజేశారు.


