
పరిస్థితుల్లో వలంటీర్ల సేవలు
● కరోనా లాంటి విపత్కర
వైఎస్సార్ సీపీ హయాంలో వలంటీర్లు ఇంటింటికి సేవలు అందించారు. అందులోనూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సందర్భంలోనూ....ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సేవలు అందించారు. ప్రజలకు సంబంధించి ఏ పని కావాలన్నా నేరుగా వారే చేసి పెట్టేవారు. వీధిలో మంచినీరు వదిలే సమయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం, సర్టిఫికెట్లు నేరుగా ఇంటికే తెచ్చి ఇవ్వడం వంటి మహోన్నత కార్యక్రమాలు చేసి మంచి సేవకులుగా గుర్తింపు పొందిన వలంటీర్లు ప్రసుత్తం ఇంటికే పరిమితమయ్యారు. కూటమి సర్కార్ పుణ్యమా అని హామీ అమలు చేయకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాడు వలంటీర్ల ద్వారా విశేష సేవలు పొందిన ప్రజలు, ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.