
12వ పీఆర్‌సీ ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్‌సీ ప్రకటించాలి. ఐఆర్ ఇవ్వాలి. 2023 జూలై నుంచి ఎరియర్స్ చెల్లించాలి. జీపీఎఫ్ ఖాతాలు తెరవాలి. మూడు సంవత్సరాల సరెండర్ లీవుల వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల పట్ల పాలకులు చిన్నచూపు చూడటం తగదు. గత సమ్మె కాలపు ఒప్పందాల అమలుకు జీవోలు విడుదల చేయాలి.
బి.సోమయ్య, మున్సిపల్ వర్కర్స్
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పారిశుద్ధ్య కార్మికులకు చాలీ చాలని వేతనాలు అందిస్తుండటంతో మా కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు భారంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి.
– అంగులూరి జాన్ బాబు,
మున్సిపల్ కార్మికుడు, ఏలూరు కార్పొరేషన్
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల అమలుకు ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. టూల్ కిట్స్, యూనిఫారం అందించాలి. వారాంతపు సెలవులు, జాతీయ, పండుగ సెలవులు, సీఎల్‌లు అమలు చేయాలి.
– కలం సాంబశివరావు, ఇంజనీరింగ్ విభాగం వర్కర్, ఏలూరు కార్పొరేషన్
రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ.75 వేలు ఇచ్చేలా జీవో ఇవ్వాలి. రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచేందుకు. దహాన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచే హామీకి తక్షణం జీవోలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాం, చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనెలు అందించాలి. కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలి.
పి.దుర్గ, పారిశుద్ధ్య విభాగం వర్కర్,
ఏలూరు కార్పొరేషన్

12వ పీఆర్‌సీ ప్రకటించాలి

12వ పీఆర్‌సీ ప్రకటించాలి

12వ పీఆర్‌సీ ప్రకటించాలి