
హెలీప్యాడ్ ప్రాంతం పరిశీలన
భీమవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం రానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహం బుధవారం కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరగనున్నందున వివాహ వేడుకకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెద అమిరంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి కల్యాణవేదికకు వచ్చి వధూవరులను ఆశీర్వదించనున్నారు.
హెలీప్యాడ్ ప్రాంతం పరిశీలన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం రానున్నందున పెదఅమిరంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను మంగళవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు పరిశీలించారు.
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం (ప్రకాశం చౌక్): ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ పీజిఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీఆర్డిఏ, పశుసంవర్ధక శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1,419 యూనిట్లు మంజూరయ్యాయని, ఎస్‌హెచ్‌జీ మహిళలు వీటి స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు మేలు జాతి ఆవులు, గేదెలు, కొనుగోలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.