
వైఎస్సార్‌సీపీలో చేరిన కూటమి కార్యకర్తలు
అత్తిలి: కూటమి పాలన పట్ల విరక్తి చెంది, ఇతర పార్టీల వారు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో కూటమి నుంచి 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. గ్రామంలో కోపల్లె తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో వీరు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దరాతి ప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబుర్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు కంభ సూరిబాబు, వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షుడు కంకటా సురేష్, పార్టీ నాయకులు రామిశెట్టి రాము, యడ్లపల్లి మణికుమార్, గుండుమోగుల ఉమా మహేష్, కోపల్లి ధనరాజు తదితరులు పాల్గొన్నారు.