తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Oct 8 2025 6:59 AM | Updated on Oct 8 2025 6:59 AM

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

పెనుగొండ: పెనుగొండ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం కావడంతో సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మోటార్‌ సైకిళ్లను వరుసగా పార్కింగ్‌ చేశారు. ఈ తరుణంలో నరసాపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఓ మోటారు సైకిల్‌ను వేగంగా ఢీకొనడంతో మోటారు సైకిళ్లు అన్నీ గుట్టలుగా ఒకదానిపై ఒకటి పడిపోయాయి. అయితే, ప్రతి మంగళవారం యాచకులు ఈ మోటారు సైకిళ్లు పక్కనే కూర్చుని భక్తులను యాచిస్తుంటారు. కానీ, ఈ రోజు కొంచెం దూరంలో ఉండి యాచిస్తుండడంతో ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. అయితే మోటార్‌ సైక్లిస్టులు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement