
టీఈటీపై రివ్యూ పిటిషన్ వేయాలి
భీమవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను కోరారు. సోమవారం కేంద్రమంత్రిని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ఎల్‌వీ చలం, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బి.త్రినాథ్ మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం 2009 అమలులోకి రాకముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా ఎన్‌సీటీఈ మార్గదర్శకాలలో సవరణ చేయాలని, పదోన్నతి కోసం ఈవో, జీవో పరీక్షలు పాస్ అవుతున్నామని మరల టెట్ కూడా పాస్ కావాలనే నిబంధనను పునఃసమీక్ష చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.