
మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఎన్నిక
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ స్టాప్ తదితర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.లక్ష్మణ మూర్తి తెలిపారు. సోమవారం జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా ఎం.రవికుమార్, కార్యదర్శిగా డి.లక్ష్మణమూర్తి, కోశాధికారిగా వి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా టీఎస్ ఆచారి, ఎం.కిషోర్, బి.సందీప్, జి.రాజకుమార్, కే.మణి, కే శేషు, సహాయ కార్యదర్శులుగా పి.అరుణ్ గోపాల్, శేఖర్, ఎం.హరిబాబు, పి.లోకేష్, ఎన్.బేబీ అనురాధ, సీహెచ్ అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.