
ఘాట్ రోడ్డులో దూసుకెళ్లిన కారు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ఘాట్ రోడ్డులో ఫుట్‌పాత్ పైకి ఆదివారం రాత్రి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు టోల్ గేట్ మీదుగా కొండపై నుంచి కిందకి వేగంగా వస్తోంది. కేశఖండన శాఖ సమీపానికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఒక్కసారిగా ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే ఫుట్‌పాత్‌పై భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం నిర్మించిన ఫెడస్టల్ షెడ్డు పోల్స్‌ను ఢీకొట్టి కారు నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, షెడ్డు పోల్స్ నేలకొరిగాయి. కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు.