చింతలపూడి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శిగా చింతలపూడి పట్టణానికి చెందిన గోలి చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారి చేశారు. ఐటీ విభాగం కార్యదర్శిగా వెలగలపల్లి గ్రామానికి చెందిన గోలి శరత్‌రెడ్డిని నియమించారు.
ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ టీం విజయభేరి
జంగారెడ్డిగూడెం: కర్నూలు జిల్లాలో జరిగిన 4వ రాష్ట్రస్థాయి జలక్రీడల డ్రాగన్ పడవ పోటీల్లో జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ టీం సత్తా చాటింది. సీనియన్ మెన్, జూనియర్ బాలుర విభాగాల్లో ఏలూరు జిల్లా తరఫున పాల్గొన్న జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ సందర్భంగా కోచ్‌లు కె.కృష్ణమూర్తి, రాజేష్‌లు మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపి 5 బంగారు పతకాలు సాధించారని తెలిపారు. జట్టులో భాగమైన జంగారెడ్డిగూడెంకు చెందిన టి.సాయిరాం, జి.సాయిరాం, భాస్కర్, పరమాత్మ, జాన్, అఖిల్, పవన్, రెహ్మాన్, లిఖిత్, నిర్మల, నాని, కుమార్, వాసు, రాఖి, సంతోష్, రూపేష్‌ను వారు అభినందించారు.
గోల్డ్ ఫైనాన్స్ బాధితుల ఆందోళన
చింతలపూడి: స్థానిక కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బాధితులు తమకు న్యాయం చేయాలని సోమవారం కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. గత నెల 9న సంస్ధలో పని చేసే ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారైన విషయం తెలిసిందే. దీంతో సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపధ్యంలో బంగారం తాకట్టు పెట్టిన తమకు సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఫోన్ చేస్తే సమాధానం చెప్పడం లేదని బాధితులు వాపోయారు.

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

వైఎస్సార్‌సీపీలో నియామకాలు