
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్–14, అండర్–17 బాల బాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే.అలివేలు మంగ తెలిపారు. సోమవారం ఇండోర్ స్టేడియంలో అండర్–14, 17 విభాగాల బాలబాలికలకు తైక్వాండో, హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో 376 క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.
లింగపాలెం: మండలంలోని ధర్మాజీగూడెంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యానును ఆదివారం రాత్రి అధికారులు పట్టుకున్నారు. గ్రామస్తుల తెలిపిన సమాచారం మేరకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యంను అధికారులు సీజ్ చేశారు. ధర్మాజీగూడెంలో కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన 10 క్వింటాళ్ల బియ్యంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీఎస్‌ఓ తెలిపారు. బియ్యం తరలించే వారిపై కేసు నమోదు చేసి, వ్యాన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.
భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని చినపేటలో విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై బి.వై.కిరణ్ కుమార్ తెలిపారు. రోజువారీ కూలిపనులు చేసుకుని జీవనం సాగించే తోట లాజరు (55) స్థానికంగా ఉన్న గుడి సమీపంలో శుభ్రం చేస్తుండగా అరటి చెట్టు విద్యుత్తు తీగలపై పడింది. విద్యుత్తు తీగలు నుంచి షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు