
కూటమి పాలనలో ఉద్యోగులకు కష్టాలు
భీమవరం: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న తలపెట్టిన చలో విజయవాడ పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల విషయం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం నిరాశ కలిగించింద న్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని కోరారు. కో–చైర్మన్ సాయివర్మ, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఎండీ బేగం అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా పీహెచ్‌సీ వైద్యులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్యుల సంఘంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు, వైద్యులు లేక రో గులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారున్నారు. జిల్లా కార్యదర్శి సీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ మంగళవారం ఆశా డే సందర్భంగా అన్ని పీహెచ్‌సీల వద్ద ఆశావర్కర్లకు జీతాలు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో వైద్యుల ఉద్యమానికి మద్దతుగా నిరసన తెలపాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు డి జ్యోతి, లారెన్స్ కుమారి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్: అఽధికారుల వేధింపుల తాళలేక శనివారం కలుపు మందు తాగిన పారిశుద్ధ్య కార్మికుడు పూనకం మునియ్య (52) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీంతో అతడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. మునియ్య మృతికి కారణమైన మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆందోళన చే శారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ సంఘట నా స్థలానికి చేరుకుని మునియ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినందున తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వ హించాలని మునియ్య బందువులకు ఎస్సై నచ్చజెప్పారు. అనంతరం మునియ్యను వేదింపులకు గురిచేసి అతడి మృతికి కారణమైన పారిశుద్ధ్య అధికారులపై పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆదివారం కావడంతో మునియ్య మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు పోలీసులు చెప్పారు.
భీమవరం: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న విజయవాడలో విజ్ఞాపన సభ ని ర్వహించనున్నట్టు ఎంటీఎస్ యూనియన్ రా ష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ తెలిపారు. విజ్ఞాపన సభ సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక లూథరన్ హైస్కూల్‌లో నిర్వహించారు. టెంపరరీ ఎంటీఎస్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, 62 ఏళ్ల వరకు సర్వీస్ పెంచాలని, 12 నెలల జీతం, మినిమమ్ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విజ్ఞాపన సభను విజయవంతం చేయాలని కోరారు. కో–ఆర్డినేటర్లు ఎం.రాజలింగం, ఎన్.అనిల్ అరవింద్‌కుమార్, ఎంవీ కృష్ణారావు, హేమంత్‌కుమార్, వీఎల్‌ఎన్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

కూటమి పాలనలో ఉద్యోగులకు కష్టాలు