
●ముంచెత్తిన వాన.. ప్రయాణానికి హైరానా
పంగిడిగూడెంలో పోలవరం కాలువ వంతెనపై వర్షం నీటిలో రాకపోకలు
అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై జోరు వాన కురిసింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువలను తలపించాయి. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టడంతో పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ వంతెనపై నీరు భారీగా నిలిచిపోయింది.ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని పంగిడిగూడెం డెయిరీ వద్ద, స్థానిక కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.
– ద్వారకాతిరుమల