నేవీ డిపోపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

నేవీ డిపోపై పోరుబాట

Oct 5 2025 9:04 AM | Updated on Oct 5 2025 9:04 AM

నేవీ

నేవీ డిపోపై పోరుబాట

సాగు భూములను ఇవ్వం భూములు పోయే పరిస్థితి

గిరిజనులు వద్దంటున్నా.. రాజకీయ ఒత్తిళ్లు

ఎంపీపై గిరిజనుల ఆగ్రహం

వంకావారిగూడెం పరిసర ప్రాంతాల్లో సాగు భూ ములు ఎక్కువగా ఉన్నా యి. పత్తి, వేరుశెనగ, ఆ యిల్‌పామ్‌ వంటి పంటలు పండించుకుంటున్నాం. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే ఊరుకోం. ఆ భూములే మాకు జీవనాధారం. నేవీ డిపో ఏర్పాటును మేం వ్యతిరేకిస్తున్నాం. మా అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి.

– తెల్లం సోమరాజు, రైతు, వంకావారిగూడెం

నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వరి, వేరుశనగ పండిస్తూ జీవనం సాగిస్తున్నాను. మా భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం అధికారులు, పాలకులు చేస్తున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతాం. మా భూములు తీసుకుంటే పూర్తిగా జీవనాధారం కోల్పోతాం. మా నిర్ణయాన్ని గౌరవించకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధం.

– బుద్దుల తులసమ్మ, రైతు, వంకావారిగూడెం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గిరిపల్లెల్లో నేవీ డిపో ఏర్పాటుపై నిప్పు రాజుకుంది. గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామసభలో వ్యతిరేక తీర్మానాలు చేసినా సర్కారు దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ ప్రత్యేక ఆసక్తితో పల్లెలు వ్యతిరేకిస్తున్నా ప్రాజెక్టు ఏర్పాటుకు చకచకా ముందుకు సాగడంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో డిపో ఏర్పాటును నిర సిస్తూ మూడుసార్లు గ్రామసభలు డిపో వద్దంటూ తీర్మానం చేసినప్పటికీ అక్కడే డిపో పెడతామని ముందుకు సాగడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 1,166 ఎకరాల నాణ్యమైన సాగుభూమిని సేకరించడానికి వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో దాట్లగూడెం, రమణక్కపేట, మడకంవారిగూడెం, వంకావారిగూడెం, తదితర గ్రామాల పరిధిలో 1,166 ఎకరాలు సేకరిస్తున్నారు. భూ సేకరణకు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. అయినా సర్కారు హడావుడి కొనసాగుతుండటంతో నిరసన ర్యాలీ, ఆందోళనలు గిరిజన సంఘాలు నిర్వహించిన క్రమంలో సెక్షన్‌–30తో అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాజాగా గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలతో నిమిత్తం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మండల పరిషత్‌లో తీర్మానం చేయించే దిశగా ముందుకు సాగుతున్నారు. భూసేకరణకు సిద్ధం చేసిన భూముల్లో ప్రస్తుతం వేరుశనగ, వర్జీనియా పొగాకు, ఆయిల్‌పామ్‌ వంటి పంటలు పండే నాణ్యమైన భూములున్నాయి. ఆ భూముల్లోనే పనిచేసుకుంటూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూములను డిపో ఏర్పాటుకు సేకరిస్తే తమ జీవనం కష్టతరంగా మారుతుందని, తాము డిపోను వ్యతిరేకి స్తున్నామని గిరిజనులు చెబుతున్నారు.

వంకావారిగూడెంలో తన భూమిలోని వేరుశనగ పంటను చూపిస్తున్న రైతు మడకం శేషారావు

జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో గిరిజన రైతుల ఆయిల్‌పామ్‌ తోట

గిరిజనులు వ్యతిరేకిస్తున్నా దూకుడుగా సర్కారు యత్నాలు

గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానం చేసినా ముందుకు..

మండల పరిషత్‌లో తీర్మానం చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు

పొగాకు సహా మంచి పంటలు పండే భూమి సేకరణకు యత్నం

నేవీ డిపోపై తీవ్రమైన తిరుగుబాటు

నేవీ డిపో ఏర్పాటుకు గ్రామసభల తీర్మానం లేకుండా ప్రభుత్వం యత్నాలు చేస్తుందని గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటివరకూ మూడుసార్లు వ్యతిరేకంగా 5 గ్రామాల గిరిజనులు తీర్మానం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన సైతం కొనసాగించారు. అయినా బలవంతంగా నేవీ డిపోను వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోనే ఏర్పాటు చేయాలని మొండిగా ముందుకు సాగుతుందని గిరిజనులు మండిపడుతున్నారు. 5 గ్రామాల ప్రజలు గ్రామ సభల్లో డిపోకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లో ఎంపీటీసీలతో అనుకూలంగా తీర్మానం చేసి ముందుకు సాగాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నేవీ డిపోకు అనుకూలంగా సంతకాలు చే యాలని రాజకీయ నాయకులు ఎంపీటీసీలకు ఫోన్‌లు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. నిబంధలకు వి రుద్ధంగా ముందుకు సాగితే తీవ్ర ప్రతిఘటనలు తప్పవని వంకావారిగూడెం ప్రజలు హెచ్చరిస్తున్నారు.

నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు జీలుగుమిల్లి మండల వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో రమణక్కపేట, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, కొత్తచీమలవారిగూడెం గ్రామాల్లో మొత్తం 1,166 ఎకరాల్లో భూములు సేకరించాలని అధికారులు ప్రజాప్రతినిధులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే పంట భూములను ఇచ్చేది లేదని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. అయినా డిపో ఏర్పాటుపై ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొండిగా ముందుకు సాగుతున్నారని గిరిజనులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకునే తమ భూములు కాకుండా అదే మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఆనుకుని ఉన్న బర్రింకలపాడు అటవీ భూముల్లో గానీ, వేరే ప్రాంతాల్లో కానీ పెట్టుకోవాలని ఇక్కడి గిరిజన ప్రజలు సూచిస్తున్నారు. తాము వద్దంటున్నా ఎంపీ పుట్టా మహేష్‌ పట్టుబట్టడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

నేవీ డిపోపై పోరుబాట 1
1/3

నేవీ డిపోపై పోరుబాట

నేవీ డిపోపై పోరుబాట 2
2/3

నేవీ డిపోపై పోరుబాట

నేవీ డిపోపై పోరుబాట 3
3/3

నేవీ డిపోపై పోరుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement