
ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శుక్రవారం భవానీ దీక్షాదారులతో ఎరుపెక్కింది. దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులంతా ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. దాంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భవానీలు, సాధారణ భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై ఎక్కడ చూసినా భవానీ దీక్షాధారులే కనిపించారు.
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన దొమ్మరి కుల పేరును, దొమ్మరి (గిరి బలిజ) గా మార్పు చేసిన అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో ఆ జీవోను నిలుపుదలచేస్తూ ఆదేశాలు జారీచేయడం మంచి పరిణామమని మండలి సభ్యుడు వంక రవీంద్ర నాథ్ అన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో బలిజ (కాపు) వర్గాల్లో అలజడి మొదలై అనేక జిల్లాలు, మండలాల్లో ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందచేశారని అన్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.720 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద బాగా తగ్గింది. 36.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
వేలేరుపాడు: ఏజెన్సీ ప్రాంతంలో సేవలందిస్తున్న వైద్యుల డిమాండ్లు పరిష్కరించాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు మిడియం సువర్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గత నెల 25 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులకు ఇన్ సర్వీస్‌లో ఉన్న వారికి పీజీ కోటా సీట్లు క్లినికల్ 30 శాతం నుంచి 15 శాతం, నాన్ క్లినికల్ కోటాలో 50 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించారన్నారు.
పెదవేగి: పెదవేగి మండలం ముండూరు శివారులోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే పెదవేగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పెదవేగి ఎస్సై రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆమె వయసు 60 నుంచి 70 సంవత్సరాలు మధ్య ఉంటుందని వివరాలు తెలిసినవారు పెదవేగి ఎస్సై 9440796638 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం