జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు

Oct 1 2025 11:25 AM | Updated on Oct 1 2025 11:25 AM

జాతీయ

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ జట్టుకు క్రీడాకారుల ఎంపిక మద్ది క్షేత్రంలో పోటెత్తిన భక్తులు చోరీ కేసు నమోదు ఇందిరమ్మ కాలనీలో చోరీ

తణుకు అర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన సీఐఎస్‌సీఈ బోర్డ్‌ 68వ నేషనల్‌ స్కూల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌

షిప్‌ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన పోతుల నవ్యగీతిక, తాడేపల్లిగూడెంకు చెందిన కొండ్రెడ్డి రాగ అండర్‌ 17 డబుల్స్‌ విభాగంలో రన్నర్స్‌గా నిలిచారు. పెంటపాడు మండలం అలంపురంలోని సరస్వతీ విద్యాలయ స్కూలులో 10వ తరగతి చదువుతున్న వీరు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కొయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించినట్లు పోతుల నవ్యగీతిక తండ్రి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు.

నూజివీడు: పట్టణానికి చెందిన ఎన్‌వీఎన్‌ కావ్యశ్రీ, డీ ఇందుప్రియ బాస్కెట్‌బాల్‌ ఏపీ జట్టుకు ఎంపికై నట్లు కోచ్‌ వాకా నాగరాజు మంగళవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్‌–14 బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కావ్యశ్రీ, ఇందుప్రియలను సెలక్షన్‌ కమిటీ రాష్ట్ర జట్టులోకి ఎంపిక చేసింది. వీరు ఈనెల 4 నుంచి 10 వరకు డెహ్రడూన్‌లో నిర్వహించే జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరుఫున ఆడతారని కోచ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను, కోచ్‌ను పలువురు పీడీలు అభినందించారు.

జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,70,623 సమకూరినట్లు కార్యనిర్వాహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు.

జంగారెడ్డిగూడెం: స్థానిక సాయి సౌజన్య నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదైంది. రైటర్‌ పి.బాబురావు తెలిపిన వివరాల ప్రకారం పెండ్ర మోహనకృష్ణ ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో సహా సెప్టెంబర్‌ 19న బుట్టాయగూడెం మండలం గంగవరం గ్రామం వెళ్లాడు. తిరిగి 29న ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో ఉంచిన 60 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

భీమవరం: భీమవరం ఇందిరమ్మ కాలనీలోని జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బీరువాలోని నగదు, ఆభరణాలను అపహరించారని బాధితురాలు సీహెచ్‌ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.నాగరాజు తెలిపారు.

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు 1
1/2

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు 2
2/2

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో రన్నర్స్‌కు అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement