
సీహెచ్‌సీలో శిశువు మృతి
పురుడు పోసిన నర్సు
ఆకివీడు: ప్రసవించిన కొన్ని నిమిషాలకే ఆడ శిశువు మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో సోమవారం ఉదయం జరిగింది. స్థానిక సమతానగర్‌లో చేపల చెరువులపై కాపలా ఉంటున్న ఏనుగుపల్లి పౌలు, శ్రావణిలకు మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. జన్మించిన 20 నిమిషాలకే మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి చెప్పారు. శిశువు మెడకు మూడు మెలికలతో ప్రేగు ఉండటం వల్ల చనిపోయి ఉంటుందని ఆమె వివరించారు. ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, స్టాప్ నర్సు వైద్యం అందించారు. శిశువు మృతి వైద్యుల నిర్లక్ష్యమేనని, డ్యూటీ వైద్యులు లేకపోవడం వల్ల స్టాఫ్‌నర్సు పురుడు పోయడం దారుణమని సీపీఎం నాయకులు కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు ఆరోపించారు.