
ఏకై క మెంటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ
● అన్న చిరంజీవిని తిట్టినా మాట్లాడని పవన్ కల్యాణ్
● విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
తణుకు అర్బన్: దేశంలోనే ఏకై క మెంటల్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని మాజీ మంత్రి కారు మూరి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయ న మెంటల్ ఉన్న వ్యక్తిగా సర్టిఫికెట్ కూడా పొందారని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ తాగి వచ్చి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై త ణుకులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో విచిత్ర వేషధారణతో పాటు అసభ్యకరంగా మాట్లాడిన బాలకృష్ణ ధోరణిని ఏ ఒక్కరూ తప్పుపట్టకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యే కామినేని జగన్‌పై దురుసుగా మాట్లాడటం, ఆపై సినీ పెద్దగా ఉన్న చిరంజీవిని సైతం బాలకృష్ణ వాడు, వీడు అన డం బాధాకరమన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ రాజకీయం చేయలేదని కారుమూరి తెలిపారు. ఆనాడు వైఎస్సారే ఆయన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు.
పవన్ కల్యాణ్ మాట్లాడరేం?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో తన తల్లిని తిట్టినవారినే ఇప్పుడు చంకనేసుకుని తిరుగుతున్నా రని కారుమూరి ఎద్దేవా చేశారు. నేడు సొంత అన్న చిరంజీవిని సైతం అసెంబ్లీ సాక్షిగా కించపరిచేలా మాట్లాడినా ఆయన ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హమన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించి గతంలో జగన్ చూపిన ప్రేమను స్పష్టంగా చెప్పారని వివరించా రు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం బాలకృష్ణ చేసిన విమర్శలపై ఎందుకు మాట్లాడడం లేదని కారుమూరి ప్రశ్నించారు.
కూటమి ఎమ్మెల్యేల నోటే పాలనా వైఫల్యాలు
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైందని కా రుమూరి విమర్శించారు. ఆ విషయాన్ని వారి ఎ మ్మెల్యేలే బాహాటంగా చెబుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని చంద్రబాబు చెబు తున్నారని, దీనిపై ఎవరైనా మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారని చెప్పారు. కానీ తమ తమ ప్రాంతాల్లో యూరియా దొరకడం లేదని, బ్లాక్‌లో అ మ్మేసుకుంటున్నారని వారి ఎమ్మెల్యేలే చెబుతున్నా రని గుర్తుచేశారు. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ గుంతల్లో బస్సులు దిగిపోతున్నాయని, మోటార్ సైకిళ్లు కూడా రోడ్లపై వెళ్లలేనంత దారుణ స్థితిలో ఉన్నాయని వారి ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆ యన తెలిపారు. రోడ్లు ఇలా ఉంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల ముందుకు వెళ్లలేని ప రిస్థితి నెలకొందని బాహాటంగా విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు కాబట్టి.. లంచాలు తీసుకొని పనులు చేయిస్తున్నామని ఒక ఎమ్మెల్యే చెబుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను వారి కార్యకర్తలే విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.