
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెబాట
న్యూస్‌రీల్
డిమాండ్లు
సమస్యల పరిష్కారం కోసమే..
సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) నాయకులు వారం క్రితమే ఉన్నతాధికారులకు నోటీసు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి కార్యాచరణ అమలు చేసే యోచనలో నిమగ్నమయ్యారు.
52 పీహెచ్‌సీలు.. 80 మంది వైద్యులు
జిల్లాలో అర్బన్ పీహెచ్‌సీలు 18, రూరల్ పీహెచ్‌సీలు 34 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 80 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినికల్‌కు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్ క్లినికల్‌కు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినికల్‌కు 15 శాతానికి, నాన్ క్లినికల్ 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినికల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్టుగా ఏపీపీహెచ్‌సీడీఏ చెబుతోంది. సీహెచ్‌సీల్లో పనిచేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్‌గా ప్రమోషన్స్ ఇస్తుంటే 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పదోన్నతలు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్‌గానే మిగిలిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.
3 నుంచి దీక్షలు : సమస్యల పరిష్కారం కోసం ఏపీపీహెచ్‌సీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 19న పీహెచ్‌సీ వైద్యులు నోటీసులు అందజేశారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా దశలవారీగా సేవలను నిలుపుదల చేస్తున్నారు. సోమవారం నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీని బహిష్కరించనున్నట్టు అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 3 నుంచి అమరావతిలో నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆందోళనలో ప్రజలు
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో పీహెచ్‌సీ వైద్యుల పోరుబాట సామాన్య ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, అపారిశుద్ధ్య వాతావరణంతో టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా జ్వరాలతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. రోజూవారి వచ్చే కేసుల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ తరుణంలో పీహెచ్‌సీ వైద్యులు ఓపీ బహిష్కరిస్తే పేదవర్గాల వారు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సర్వీస్‌లోని పీహెచ్‌సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలి.
టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలి.
గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలి.
చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలి.
కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదేళ్లకు కుదించాలి, నేటివిటీపై స్పష్టత ఇవ్వాలి.
సర్వీస్ వైద్యుల పీజీ కోటా తగ్గింపు
ఇంక్రిమెంట్లలోనూ మొండిచేయి
డిమాండ్ల సాధనకు సోమవారం నుంచి సమ్మెలోకి..
అత్యవసర కేసులు మినహా ఓపీ విధుల బహిష్కరణకు నిర్ణయం
జిల్లాలో 54 పీహెచ్‌సీల్లో 80 మంది వైద్యులు
పీహెచ్‌సీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికే దశలవారీగా ఆందోళన ప్రారంభించాం. ప్రభుత్వం స్పందించకుంటే ఏపీపీహెచ్‌సీడీఏ పిలుపుమేరకు సోమవారం అత్యవసర సేవలు మినహా ఓపీ విధులను బహి ష్కరిస్తాం. అక్టోబరు 3న విజయవాడలో ని రాహార దీక్షలు చేపడతాం.
–డా.సీహెచ్ వెంకటరంగం నాయుడు, ఏపీపీహెచ్‌సీడీఏ జిల్లా అధ్యక్షుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతలు రావడం లేదని, జాయిన్ అయినప్పుడు ఉన్న కేడర్‌లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంటుందని వైద్యులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు లేకుండా పనిచేస్తున్న పీహెచ్‌సీ వైద్యులు ఎంతోమంది ఉన్నారని, అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో సేవలందిస్తున్న వారికి అలవెన్స్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. అప్పటికప్పుడు రిపోర్టులు కోరడం, వైద్య విభాగానికి సంబంధం లేని వారి అజమాయిషీ ఇలా ఎన్నో విషయాల్లో పీహెచ్‌సీ వైద్యులను ఇబ్బందులు పాల్జేస్తున్నారని ఏపీపీహెచ్‌సీడీఏ నేతలు చెబుతున్నారు.

పీహెచ్‌సీ వైద్యుల సమ్మెబాట

పీహెచ్‌సీ వైద్యుల సమ్మెబాట