
గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు
పాలకొల్లు సెంట్రల్: తమ న్యాయబద్ధమైన కోరికలు వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల నూతన కమిటీ అధ్యక్షుడు దేవరకొండ రాజ్‌కుమార్ అన్నారు. శనివారం రాష్ట్ర ఏపీవీడబ్ల్యూఎస్‌ఈ జేఏసీ కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ందించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మా ట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు, వారి బకాయిలు, ప్రమోషన్స్, మదర్ డిపార్ట్‌మెంట్లలో విధుల నిర్వహణ, డోర్ టు డోర్ సర్వీస్ అందించే విధానానికి స్వస్తి పలకడం వంటి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్టు తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు, 40 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరుతూ ఈనెల 29 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ఏపీ మెడికల్ కాంటాక్టు వర్కర్స్ యూనియన్ తణు కు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు అ న్నా రు. యూనియన్ ఆధ్వర్యంలో శనివారం స్థాని క జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కార్మికులతో కలిసి నిరసన తెలిపి అనంతరం సూపరింటెండెంట్ కె.సాయికిరణ్‌కు సమ్మె నోటీసు అందజేశారు. భీమారావు మాట్లాడుతూ కార్మి కులకు తక్కువ వేతనాలు కూడా ప్ర తినెలా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రి స్థా యికి తగ్గట్టు కార్మికులు లేకపోవడంతో ఉన్నవారికి భారం పడుతోందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయ కులు ధర్మాని పుష్పలత, భారతి, సీహెచ్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శనివారం సంఘ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం తణుకు అమరవీరుల భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మద్యాన్ని ఏరులై పారిస్తూ లక్షలాది మంది గీత కార్మికుల ప్రయోజనాలను దిగజార్చించిందన్నారు. గీత కార్మికులు ఉన్న ఊరిలో బతకలేక వలసలు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ ప్ర మాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మృతిచెంది న కార్మికులకు పక్క రాష్ట్రంలో రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బొక్క చంటి పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): జీఎస్టీ తగ్గింపు ఫ లాలు అందరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల అమలులో భాగం ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, రవాణా, నిర్మాణ, బీమా, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ 2.0పై ప్రజల్లో అవగాహన కల్పించేంతమ వంతు సహకారం అందించాలని కోరా రు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజ, డీపీఓ ఎం.రామనాథరెడ్డి పాల్గొన్నారు.

గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు