
ఆక్వా వర్సిటీపై నిర్లక్ష్యం
తణుకులో భారీ చోరీ
ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. IIలో u
నరసాపురం రూరల్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఆక్వా యూనివర్సిటీ నిర్మా ణ పనులను పూర్తిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ కోరారు. శనివారం పార్టీ ప్రతినిధుల బృందం యూనివర్సిటీ నిర్మాణాలను పరిశీలించింది. గోపాలన్ మాట్లాడుతూ ఆక్వా అభివృద్ధికి తోడ్పడే వర్సిటీ నిర్మాణంపై కూటమి ప్రభు త్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటినా పు నాది దశ కూడా పూర్తికాకపోవడం సిగ్గుచేటన్నారు. దీంతో మత్స్య కళాశాల విద్యార్థులు రెండేళ్లుగా తుపాను రక్షిత భవనంలో ఇరుకు గదుల్లో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ స భ్యుడు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ము చ్చర్ల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.