
ఆర్జీయూకేటీ ఎంఓయూలు
నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారులు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు సంస్థలతో రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఫిజిక్స్ వాలా లిమిటెడ్‌తో ఒప్పందం మేరకు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల విద్యార్థులకు 14 కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తారు. వీటిలో వీటిలో గేట్, క్యాట్‌లతో పాటు ప్రొ ఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, సెమినార్లు, వెబి నార్లు, మాక్ పరీక్షలు, మెంటార్ షిప్ ఉంటాయి. అలాగే కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ కాంపెటెన్సీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా పారిశ్రామిక అనుభవం, ఇంటర్న్‌షిప్‌లు, నిపుణుల ఉపన్యాసాలు, వ్యాపార శిక్షణ, వర్చువల్ లెర్నింగ్ అవకాశాల ద్వారా విద్యార్థుల శిక్షణను మెరుగుపరుస్తా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.