
కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వాన
డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా, హోంసైన్స్ శాస్త్రవేత్త, కేవీకే
ఉండి: కమ్యూనిటీ సైన్స్ (హోం సైన్స్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం హోంసైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి గల ఈ డిగ్రీ కోర్సును బీఎస్సీ ఆనర్స్‌గా పిలుస్తున్నారని, ఇందులో చేరేందుకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 3 ఏళ్ల హోంసైన్స్, అగ్రికల్చర్ డిప్లమో గ్రూపులో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సైన్స్ కోర్సులో చేరి విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బాలకృష్ణది కొవ్వెక్కిన భాష
●అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలి
●జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు
తాడేపల్లిగూడెం: బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అని మాట్లాడటం ఎంత కొవ్వెక్కిన భాష.. ఈ విషయంలో బాలకృష్ణ చిరంజీవికి అసెంబ్లీ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అంటూ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా చూస్తున్న రికార్డెడ్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బాలకృష్ణ అసలు చిరంజీవి గురించి ప్రస్తావించకూడదన్నారు. కొవ్వెక్కిన భాషను బాలకృష్ణ వాడారన్నారు. జనసేన పార్టీ కూటమిలో ఉన్నందున చిరంజీవి వేరు, పవన్ వేరని బాలకృష్ణ అనుకుంటున్నట్టున్నారని చెప్పారు. చిరంజీవి గురించి బాలకృష్ణ అవాకులు, చవాకులు పేలితే ఆయన అసలు అసెంబ్లీకి రాకపోదురేమో అనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జనసేన చాలా సీరియస్‌గా ఉందన్నారు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రభుత్వ విప్, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజకీయాల్లో అలసిపోయానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. వ్యవసాయం చేసుకుంటానన్నారు. జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రజా సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్నవారికి మద్దతు ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆకివీడు: ఖరీఫ్ పంట సాగుకు మళ్లీ ముంపు బెడద తప్పడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని పంట నీట మునిగింది. కొల్లేరు తీరంలోనూ, ఉప్పుటేరు, వెంకయ్య వయ్యేరు పంట కాల్వకు చేర్చి, చినకాపవరం డ్రెయిన్ ప్రాంత ఆయుకట్టు ముంపునకు గురవుతోంది. మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 250 ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. ఇప్పటికే ఉప్పుటేరు గుండా ముంపు నీరు భారీగా సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. ఉప్పుటేరులో రైల్వే ఖానాల వద్ద, బైపాస్ వంతెన నిర్మాణం వద్ద మేటలు వేయడంతో నీటి ప్రవాహానికి కొంత ఇబ్బంది కరంగా ఉంది. ముంపు తీవ్రత అధికంగా ఉంటే మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనంతో భక్తజన మది పులకించింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన భవానీ దీక్షాదారులు, తిరుగు ప్రయాణంలో పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి విచ్చేశారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు కళకళలాడాయి. స్వామి దర్శనం తరువాత ఉచిత ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోకి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వాన

కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వాన