
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం
ఉంగుటూరుః విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ బి.సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం నారాయణపురం సబ్‌స్టేషన్ వద్ద నిర్వహించిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు 939 సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు రాగా 746 సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎం. మురళీ క్రష్ణ, ఏఈ కేఎం అంబేత్కర్, డిప్యూటీ ఏఈ రాళ్ల పల్లి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.