
అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం
ఏలూరు రూరల్: అథ్లెటిక్స్ పోటీల్లో ఏలూరు బాలిక ప్రతిభ చాటిందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో 18 ఏళ్ల వయసు విభాగంలో పాల్గొన్న జిల్లా అథ్లెట్ వి.రంజని మిడిల్ రిలే రన్నింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిందని వివరించారు. శాప్‌కోచ్ గంట కృష్ణకుమారి వద్ద శిక్షణ పొందిన రంజని అందరిలో స్ఫూర్తి నింపిందని ఆమెను అభినందించారు.
ఆగిరిపల్లి : అదుపుతప్పి కుంపిని వాగులోకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటన శోభనాపురం వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కొండపల్లి నుంచి కంకర లోడుతో వస్తున్న లారీ శోభనాపురం కుంపిని వాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కుంపిని వాగులోకి దూసుకుపోయింది. కుంపిని వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లారీని బయటికి తీయడం సాధ్యపడడం లేదు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సామాజిక న్యాయానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2010లో కడప ఎంపీగా ఉన్నప్పుడే ఏబీసీడీ వర్గీకరణకు మద్దతు తెలియజేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, రిజర్వేషన్ ఫలాలు ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలకు చివర కులాల వరకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్న సదుద్దేశంతోనే శాసనసభ మండలిలో ఆమోదించిన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో మంత్రి మండలిలో కూడా సామాజిక న్యాయం చేశారని కొనియాడారు.
ముదినేపల్లి రూరల్: భూమిలో వాటా పంచి ఇవ్వమని దౌర్జన్యానికి వచ్చి వ్యక్తిని గాయపరిచిన సంఘటన మండలంలోని పేరూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి వీరనారాయణ కలిదిండి మండలం కొండూరుకు చెందిన తోలేటి చుక్కమ్మ సోదరి అవుతుంది. వీరనారాయణకు పేరూరులో కొంత భూమి ఉంది. దీనిలో కొంత భూమిని చుక్కమ్మకు ఇవ్వాలంటూ తోలేటీ శ్రీనివాసరావు, సాయి, రేష్మా, పెంటయ్య, బి.మాసయ్య, టి సుబ్బారావు వీరనారాయణ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి గాయపరిచినట్లు ఫీర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ ఎస్వీ రామారావు కేసు నమోదు చేశారు.
ముదినేపల్లి రూరల్: మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని చేవూరుకి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన రాకేష్ కొంతకాలంగా తన కోర్కెను తీర్చమని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మహిళ తన భర్తతో పాటు అత్తమామలతో చెప్పగా వీరంతా కలిసి రాకేష్ ఇంటికి వెళ్లగా రాకేష్‌తో పాటు అక్కడే ఉన్న బి.పృథ్వీరాజ్ మహిళతో పాటు భర్త, అత్తమామలపై దాడి చేశారు. అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.

అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం