
సర్కారుపై సమర శంఖం
న్యూస్‌రీల్
ఉద్యోగుల డిమాండ్లు
అన్నదాన కష్టాలు
మావుళ్లమ్మ దేవస్థానంలో అన్నదాన కష్టాలు వెంటాడుతున్నాయి. ఇరుకు గదిలో భక్తులు ఒకరిపై ఒకరూ పడుతూ అన్నప్రసాదం తినాల్సి వస్తోంది. 10లో u
కష్టపడి ఉన్నత చదువులు చదివారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సచివాలయ ఉద్యోగులుగా సర్కారు కొలువులు సాధించారు. సెలవులు, వేళాపాలా లేకుండా సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం ఇంటింటికీ తిప్పుతూ తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందన్న ఆవేదనతో పోరుబాట పట్టారు. ఐక్యవేదిక పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి వివిధ రీతుల్లో నిరసనలు తెలుపుతున్నారు.
ఇసుక అక్రమాలపై చర్యలేవి?
ఆందోళనలో భాగంగా నేటి నుంచి ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల, మున్సిపల్ కార్యాలయాల ముందు ఫ్లకార్డులతో నిరసన తెలియజేయనున్నారు.
● 27న జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయడం.
● 28న విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభ, అలాగే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ శంఖారావం పేరిట 26 జిల్లాల్లో స్టీరింగ్ కమిటీల సమావేశాల నిర్వహణ.
● 29న పింఛన్ నగదు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగడం.
● 30న దుర్గాష్టమి సెలవుదినం. అక్టోబరు 1న నల్లబ్యాడ్జీలు ధరించి యథావిధిగా ఇంటింటికీ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ.
● 2న గాంధీ జయంతి రోజు ప్రత్యక్ష్య కార్యక్రమాలకు విరామం. మహాత్మా మా ఘోష వినంటూ వాట్సప్ స్టేటస్ అప్‌లోడ్ చేయడం.
● 3న మండల, మున్సిపల్ స్టీరింగ్ కమిటీల సన్నాహాక సమావేశం. 4న జిల్లా స్టీరింగ్ కమిటీ, 5న రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతీయ సభలకు ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
శురకవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం : ప్రజల చెంతకే ప్రభుత్వ సేవల్ని చేరువచేస్తూ గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తెచ్చింది. గ్రామాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా చొప్పున జిల్లాలో 535 సచివాలయాలను ఏర్పాటు చేసింది. రాజకీయ జోక్యం, పైరవీలకు తావివ్వకుండా ఉద్యోగ నియామకాలు చేయడంతో పాటు సర్వీసు రూల్స్ వర్తింపచేసి అప్పట్లోనే రెగ్యులరైజ్ కూడా చేశారు. ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్‌న్‌ఎం, విలేజ్ సర్వేయర్ తదితర హోదాల్లో 4,331 మంది పనిచేస్తున్నారు.
పనిభారం పెంచేసిన కూటమి
గతంలో క్షేత్రస్థాయిలో అర్హులందరికి ప్రభుత్వ పథకాలు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కూటమి ప్రభుత్వం జాబ్‌చార్ట్‌లో లేని పనులు చేయిస్తూ పనిభారం మొత్తం సచివాలయ ఉద్యోగులపై మోపింది. గతంలో నలుగురు వలంటీర్లు చేసే పని ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగిపై పడింది. పండుగలు, సెలవురోజులు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఆత్మగౌరవం కోసం..
ఇంటింటికీ తిప్పడం ద్వారా తమను పెద్ద వలంటీర్లుగా మార్చేశారని, క్షేత్రస్థాయిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా విద్యార్హతల ఆధారంగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పేరిట సచివాలయ ఉద్యోగులు అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ గళమెత్తుతున్నారు. ఈమేరకు ఈనెల 22వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువిస్తూ 8వ తేదీన అధికారులకు నోటీసు అందజేశారు.
పోరుబాటలో ఉద్యోగులు
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 5 వరకు తదుపరి కార్యాచరణను ఐక్యవేదిక విడుదల చేసింది. ఈమేరకు మూడు రోజులుగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో సచివాలయం ముందు ఫ్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు.
ఇంటింటా సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి.
నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
ఆరేళ్ల పాటు ఒకే కేడర్‌లో సర్వీస్ చేసిన వారికి ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
ఉద్యోగులకు ప్రస్తుతం అమలు అవుతున్న రికార్డు అసిస్టెంట్ కేడర్‌ను జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు మార్చాలి.
అన్ని విభాగాల్లో ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలి.
స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు తేవాలి.
ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి.
సమయ పాలన లేని ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కల్పించాలి.
కార్యాలయ పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించరాదు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ వంక గళం
ఉలిక్కిపడి సర్దుకుంటున్న అక్రమార్కులు
ఆత్మగౌరవం కోసం సచివాలయ ఉద్యోగుల పోరుబాట
అక్టోబరు 5 వరకు వివిధ పద్ధతుల్లో నిరసనలు
29న అధికారిక వాట్సప్ గ్రూప్‌ల నుంచి వైదొలగడం
అక్టోబరు 1న నల్లబ్యాడ్జీలు ధరించి పింఛన్ల పంపిణీ
ఐక్యవేదిక యాక్షన్ ప్లాన్ మేరకు నిరసనల్లో పాల్గొంటున్న సచివాలయ ఉద్యోగులు

సర్కారుపై సమర శంఖం

సర్కారుపై సమర శంఖం