
కూటమి ప్రభుత్వం విఫలం
పెనుగొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో క్యాంపు కార్యాలయంలో మండల గ్రామ కమిటీల నియామకంపై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అలవికాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. రైతులను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసిందన్నారు. నేటి వరకూ వారికి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదని, ధాన్యం సొమ్ములు సకాలంలో చెల్లించడంలో విఫలమైందని అన్నారు. పేదలకు ఉన్నత విద్య అందనివ్వకుండా ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. వీటిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలను విజయవంతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్నం రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌలీశ్వర రెడ్డి, నల్లిమిల్లి వేణు ప్రతాపరెడ్డి, ముత్యాల నాగేశ్వరరావు, ఇళ్ల చంద్రకళ, చింతపల్లి గురుప్రసాద్, పులిదిండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు