
అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్‌లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టరు చదలవాడ నాగరాణి సూచించారు. సోమ వారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు 194 అర్జీలు అందాయని వాటిని ఆయా శాఖాధికారులకు పంపి వేగంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగించరాదని, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం సమిత్వ ప్రగతిపై సమీక్షించారు. ఈ నెల 27 నాటికి సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు.